Fri Mar 20 2026 23:54:46 GMT+0530 (India Standard Time)
Telangana : నేడు తెలంగాణ కేబినెట్ భేటీ
నేడు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బడ్జెట్ ను మంత్రిమండలి ఆమోదించనుంది.

నేడు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బడ్జెట్ ను మంత్రిమండలి ఆమోదించనుంది. రెండో రోజు శాసనసభ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. రేపు ఆర్థికమంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు.
సభ ముగిసిన తర్వాత...
ఈరోజు శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే మంత్రి మండలి సమావేశం అవుతుంది. బడ్జెట్ కు ఆమోదం తెలపనుంది. ఈసారి లోక్సభ ఎన్నికలు ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం ఓటు ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే ఆర్థిక శాఖ అధికారులు బడ్జెట్ ప్రతులను రూపొందించారు.
Next Story

