Sat Mar 21 2026 05:11:53 GMT+0530 (India Standard Time)
నేడు మంత్రివర్గ సమావేశం.. కీలక నిర్ణయాలు
ఈరోజు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

ఈరోజు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, కొత్త వేరియంట్ కలకలంపై కేసీఆర్ చర్చించనున్నారు. ఇప్పటికే శంషాబాద్ విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రయాణికులకు పరీక్షలు చేస్తున్నారు. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే వారిని క్వారంటైన్ లో ఉంచాలని నిర్ణయించనున్నారు.
ఆంక్షలను...
దీంతో పాటు మాల్స్, సినిమా హాళ్లు వంటి వాటి రద్దీపై కూడా ఆంక్షలను విధించే అవకాశముంది. దీంతో పాటు వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యంపై కూడా కేసీఆర్ చర్చించనున్నారు. ధాన్యం కొనుగోళ్లపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.
Next Story

