Sat Dec 13 2025 22:35:14 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం
నేడు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరగనుంది.

నేడు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తేదీలను మంత్రి వర్గంలో ఖరారు చేసే అవకాశముంది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలను ముందుగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి...
ఈ నేపథ్యంలో ఈరోజు జరిగే మంత్రి వర్గ సమావేశంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాయనుంది. ఈ లేఖతో ఎన్నికల కమిషన్ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు చేయనుంది. ఇప్పటికే యాభై శాతం రిజర్వేషన్లను మించకుండా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
Next Story

