Tue Jan 20 2026 20:50:23 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం
తెలంగాణ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది.

తెలంగాణ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. మధ్యాహ్నం రెండు గంటలకు అసెంబ్లీ కమిటీ హాలులో కేబినెట్ భేటీ జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ మంత్రివర్గ సమావేశంలో కొన్ని కీలక బిల్లులకు ఆమోదం తెలపనున్నారు. ప్రధానంగా ఆర్ఓఆర్, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. ఈ బిల్లులను శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
పంచాయతీ రాజ్ చట్ట సవరణకు...
అలాగే ఇద్దరికి మించి సంతానం ఉన్న వారు కూడా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా పంచాయతీ రాజ్ చట్టసవరణను ఆమోదించనుంది. ఈ సమావేశలోనే రైతు భరోసా విడుదలపై చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది. రైతు భరోసాకు సంబంధించి విధివిధానాలను ఖరారు చేసేందుకు తెలంగాణ మంత్రి వర్గ సమావేశంలో చర్చించనున్నారు. దీంతో పాటు మరికొన్ని కీలక అంశాలపై చర్చించి ఒక నిర్ణయం తీసుకోనుంది.
Next Story

