Sun Mar 15 2026 13:40:54 GMT+0530 (India Standard Time)
Telangana : ఈ నెల 25న తెలంగాణ మంత్రి వర్గ సమావేశం
తెలంగాణ మంత్రి వర్గ సమావేశం ఈ నెల 25వ తేదీన జరగనుంది.ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది

తెలంగాణ మంత్రి వర్గ సమావేశం ఈ నెల 25వ తేదీన జరగనుంది. మధ్యాహ్నం రెండు గంటలకు రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ముఖ్యంగా వర్షాకాల అసెంబ్లీ సమావేశాలపై ఈ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇచ్చిన నివేదికపై చర్చించాల్సి ఉన్నందున సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నారు.
యూరియా కొరతపై...
దీంతో పాటు రాష్ట్రంలో ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ లో యూరియా కొరతపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చించే ఛాన్స్ ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి యాభై వేల మెట్రిక్ టన్నులు వచ్చిన వెంటనే ఏ ప్రాతిపదికన పంపిణీ చేయాలన్న దానిపై కూడా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ విషయంతో పాటు పలు కీలక అంశాలకు మంత్రి వర్గ సమావేశం ఆమోదం తెలిపే అవకాశముంది.
Next Story

