Fri Dec 05 2025 22:46:29 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : ఈ నెల 10న తెలంగాణ మంత్రి వర్గ సమావేశం
ఈ నెల 10వ తేదీన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది.

ఈ నెల 10వ తేదీన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం రెండు గంటలకు సచివాయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ప్రధానంగా మేడిగడ్డ రిజర్వాయర్ మరమ్మతులపై ఎన్.డి.ఎస్.ఏ, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఇచ్చిన నివేదికలపై సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది.
కీలక అంశాలపై చర్చ...
దీంతో పాటు ఈ నెల 14వ తేదీన రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయాలని నిర్ణయించారు. దీనిపై కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ప్రతి నెల రెండుసార్లు మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించడంతో ఈ నెల పదోతేదీన సమావేశం జరుగుతుంది. అలాగే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలపై కూడా చర్చించే అవకాశముంది. దీంతో పాటు ఉద్యోగులు, రైతుల అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలిసింది.
Next Story

