Sun Mar 15 2026 19:21:41 GMT+0530 (India Standard Time)
Telangana : ఈ నెల23న తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాల దిశగా
ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. కీలక అంశాలను ఈ సమావేశంలో ఆమోదించనున్నారు

ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. కీలక అంశాలను ఈ సమావేశంలో ఆమోదించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కొన్ని నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నారు. ఇప్పటికే మూసీ నది పునరుజ్జీవం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.
నిర్ణయాలు ఇవేనట...
దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది. అదే సమయంలో నదులు, కాల్వలు, నాలాలపై ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు హైడ్రాకు ఇచ్చిన అధికారాలపై చర్చించనుందని తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా, మూసీ పునరజ్జీవం వంటి వాటిపై మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చే అవకాశముందని తెలిసింది. దీంతో పాటు మరికొన్ని కీలక అంశాలు కూడా కేబినెట్ ముందుకు వచ్చే అవకాశముందని తెలిసింది. అసెంబ్లీ సమావేశాల తేదీని కూడా ఈ సమావేశంలో నిర్ణయించే ఛాన్స్ ఉంది.
Next Story

