Sat Mar 07 2026 23:18:32 GMT+0530 (India Standard Time)
10న కేబినెట్ భేటీ.. కీలకనిర్ణయాలివే
ఈ నెెల 10 తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు

ఈ నెెల 10వ తేదీన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా ధాన్యం కొనుగోళ్ల పై ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. రైతుల నుంచి మరింత వేగంగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, దీనిపై మంత్రి వర్గ సమావేశంలో చర్చించే అవకాశముంది.
ఇళ్ల నిర్మాణానికి...
అలాగే ఎన్నికలకు ముందు సొంత స్థలాలు ఉన్న వారికి ఇళ్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం అందించే పథకంపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయలను ఇవ్వాలని నిర్ణయించే అవకాశముంది. దీనిపై కూడా మంత్రి వర్గ సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశముంది. అలాగే దళిత బంధు అమలుపైన కూడా సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది.
Next Story

