Sat Dec 13 2025 22:33:17 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : తెలంగాణ మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయాలివే
తెలంగాణ మంత్రి వర్గ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది

తెలంగాణ మంత్రి వర్గ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని విస్తరించాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పెద్ద అంబర్ పేట్, జల్ పల్లి, శంషాబాద్, తుర్కయంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, మేడ్చల్, నాగారం, దమ్మాయి గూడ, పోచారం, ఘట్ కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, దుండిగల్, బొల్లారం,తెల్లాపూర్, అమీన్ పూర్, బడంగ్ పేట్, బండ్లగూడ జాగీర్, మీనర్ పేట్, బోడుప్పల్, నిజాంపేట్, ఫిర్జాది గూడ, జవహర్ నగర్ మున్సిపాలిలీలను జీహెచ్ఎంసీలో విలీనంచేయాలని మంత్రి వర్గ సమావేశం నిర్ణయించింది.
27 మున్సిపాలిటీలను...
అలాగే విద్యుత్తు పంపిణీకి సంబందించి మరో డిస్కమ్ ను ఏర్పాటు చేయాలని కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త డిస్కమ్ పరిధిలోకి లిఫ్ట్ ఇరిగేషన్ కనెక్షన్లు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లయ్,వ్యవసాయ కనెక్షన్లు, మిషన్ భగీరధ కనెక్షన్లు వచ్చేందుకు ఆమోదం తెలిపింది. మూడు వేల మెగా వాట్ల సోలార్ విద్యుత్తు కొనుగోలు చేసేందుకు టెండర్లను పిలవాలని కేబినెట్ సమావేశం నిర్ణయించింది. ఓఆర్ఆర్ ను ఆనుకుని ఉన్న 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కేబినెట్ సమావేశం నిర్ణయించింది.
Next Story

