Tue Jan 20 2026 23:33:26 GMT+0000 (Coordinated Universal Time)
నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్
పోలీసు శాఖలో పోస్టుల భర్తీకి తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 3,966 పోస్టులకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది

పోలీసు శాఖలో పోస్టుల భర్తీకి తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 3,966 పోస్టులకు ఆమోదం తెలుపుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పోలీసు శాఖను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది. కేబినెట్ సమావేశంలో మాదక ద్రవ్యాల విషయంపైనా కేబినెట్ సమవేశంలో చర్చ జరిగినట్లు చెబుతున్నారు.
పోలీసు స్టేషన్ల నిర్మాణం...
పోలీస్ శాఖలో పోస్టుల భర్తీతో పాటు పోలీసు స్టేషన్ల నిర్మాణం, ఇతర వసతుల ఏర్పాటు వంటివి చేయాలని నిర్ణయించింది. ఇందుకు అవసరమైన నిధులను కేటాయించాలని నిశ్చయించింది. శాంతిభద్రతలను పరిరక్షించడంలో భాగంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. కొత్త డివిజన్ల ఏర్పాటుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Next Story

