Sat Dec 13 2025 22:32:57 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : తెలంగాణలో మరో ఉప ఎన్నిక.. రెడీ అయిందిగా
తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల్లో ఒకరు మాత్రం రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నారని తెలిసింది

తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల్లో ఒకరు మాత్రం రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నారని తెలిసింది. పది మంది ఎమ్మెల్యేల్లో తొమ్మిది మంది సేఫ్ లో ఉంటారా? లేక ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై మాత్రమే అనర్హత వేటు పడదా? అన్నది చర్చనీయాంశమైంది. ఇందులో ఖచ్చితంగా అనర్హత వేటు పడేది మాత్రం దానం నాగేందర్ మాత్రమే. మరొక రు స్టేషన్ ఘన్ పూర్ కు చెందిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. దానం నాగేందర్ నేరుగా బీఆర్ఎస్ గుర్తు మీద 2023 ఎన్నికల్లో గెలిచి 2024 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేశారు. మరొకరు కడియం శ్రీహరి పోటీ చేయకపోయినా ఆయన కుమార్తె వరంగల్ ఎంపీగా బరిలో ఉండటంతో కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారం చేశారు.
అనర్మత వేటు పడక ముందే...
ఈ ఇద్దరిపైనే వేటు పడే అవకాశముందన్న ప్రచారం జరుగుతుంది. మిగిలిన వారిపై ఎలాంటి ఆధారాలు లేవని చెబుతున్నారు. అయితే కడియం శ్రీహరి విషయంలోనూ కొంత పట్టువిడుపులుకు వెళ్లే అవకాశముంది. ఇప్పటికే దానం నాగేందర్ కు న్యాయనిపుణులు ఇచ్చిన సలహా మేరకు అనర్హత వేటు పడకముందే రాజీనామా చేయడం మంచిదని సూచిస్తున్నారు. ఆయన త్వరలోనే రాజీనామా చేసే అవకాశముందని సమాచారం. ఈ ఇద్దరికి స్పీకర్ నోటీసులు జారీ చేయడంతో వీరిద్దరిలో ఒక్కరు రాజీనామా చేసి ఎన్నికలకు వెళతారా? లేక ఇద్దరూ వెళతారా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే దానం నాగేందర్ మాత్రం ఖచ్చితంగా రాజీనామా చేసే అవకాశాలున్నాయని తెలిసింది.
దానం మాత్రం...
ఇప్పటికే ఎనిమిది మంది ఎమ్మెల్యేలను విచారించిన స్పీకర్ గడ్డం ప్రసాదరావు తీర్పును రిజర్వ్ లో ఉంచారు. వీరిద్దరి విచారణ పూర్తయిన తర్వాత తీర్పు చెప్పే అవకాశముంది. సుప్రీంకోర్టు అనర్హత వేటుపై గడువు మరో నాలుగు వారాలు పొడిగించడంతో ఈ లోపు దానం నాగేందర్ రాజీనామా చేస్తారంటున్నారు. త్వరలోనే తన రాజీనామా లేఖను స్పీకర్ ఇవ్వడం, ఆయన ఆమోదించడం జరిగిపోతాయంటున్నారు. కడియం శ్రీహరి విషయంలో మాత్రం ఆలోచనలో ఉన్నారని, ఆయనను తప్పిస్తారని ఇప్పటికే కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మరో ఉప ఎన్నిక తెలంగాణలో రావడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఒకటా? రెండు చోట్లా అన్నది త్వరలోనే తేలుతుంది.
Next Story

