Fri Dec 05 2025 16:12:14 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్నికల బడ్జెట్ ... రెడీ అవుతున్న సర్కార్
ఫిబ్రవరి మొదటి వారంలో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశముంది

ఫిబ్రవరి మొదటి వారంలో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశముంది. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 5వ తేదీన బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. ఎన్నికల బడ్జెట్ కావడంతో ఈ బడ్జెట్ లో పేద, మధ్యతరగతి ప్రజలకు అనుకూలంగా నిధులు కేటాయించే అవకాశముంది. అనేక పథకాలకు నిధులు అత్యధికంగా కేటాయించే అవకాశముంది.
ఈ ఏడాదిలోనే ఎన్నికలు...
ఈ ఏడాదిలోనే తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ముందు బడ్జెట్ కావడంతో పేద వర్గాలను ఆదుకునేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించే అవకాశముంది. ముఖ్యంగా దళితబంధు పథకం వంటి వాటికి అత్యధిక నిధులు కేటాయించనుందని సమాచారం. ఇప్పటికే ఉద్యోగాల నోటిఫికేషన్ లు వరసగా వెలువడుతున్నాయి. ఉద్యోగాల కల్పనపై బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మరో ప్రకటన చేసే అవకాశముంది.
Next Story

