Thu Mar 19 2026 00:30:59 GMT+0530 (India Standard Time)
బండి సంజయ్ అరెస్ట్.... నేడు బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు.

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఉపాధ్యాయులకు మద్దతుగా బండి సంజయ్ ఒకరోజు జాగరణ దీక్ష చేయాలని నిర్ణయించారు. కరీంనగర్ జిల్లాలోని కార్యాలయంలో దీక్షకు దిగారు. అయితే పోలీసులు తెల్లవారుజామున ఆయన దీక్షను భగ్నం చేసి పోలీసు కార్యాలయానికి తరలించారు. బండి సంజయ్ ను అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఉద్రికత్త...
బండి సంజయ్ అరెస్ట్ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. సంజయ్ ను అరెస్ట్ చేయనీయకుండా కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో టియర్ గ్యాస్ ను వదిలారు. పోలీసులు కార్యకర్తలపై లాఠీ ఛార్జీ చేశారు. బండి సంజయ్ అరెస్ట్, కార్యకర్తలపై లాఠీ ఛార్జికి నిరసనగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు నిరసనలు వ్యక్తం చేయనున్నాయ.
Next Story

