Mon Mar 16 2026 12:23:16 GMT+0530 (India Standard Time)
బండి పాదయాత్ర ప్రారంభం
ఐదో విడత ప్రజాసంగ్రామ పాదయాత్రను తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రారంభించారు

ఐదో విడత ప్రజాసంగ్రామ పాదయాత్రను తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రారంభించారు. హైకోర్టు ఆదేశాలతో భైంసా నుంచి తన పాదయాత్రను ప్రారంభించారు. కోర్టు షరతులకు లోబడి భైంసా మూడు కిలో మీటర్లకు దూరంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. సాయంత్రం బహిరంగ సభ జరగనుంది.
సాయంత్రం సభ...
ఈ సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటున్నారు. గణేష్ జిన్నింగ్ ఫ్యాక్టరీ వద్ద బహిరంగ సభను ఏర్పాటు చేశారు. భైంసా పట్టణంలో నేడు కూడా 144 వ సెక్షన్ విధించినట్లు పోలీసులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భైంసా పట్టణంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story

