Wed Mar 18 2026 19:48:55 GMT+0530 (India Standard Time)
జనగామలో కొనసాగుతున్న బండి పాదయాత్ర
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర జనగామలో కొనసాగుతుంది.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర జనగామలో కొనసాగుతుంది. నిన్న టీఆర్ఎస్ బీజేపీ వర్గాల మధ్య ఘర్షణలు జరిగిన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం విస్నూర్ నుంచి ఈరోజు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రను ప్రారంభించారు. ఈరోజుతో బండి సంజయ్ వెయ్యి కిలోమీటర్ల పాదయత్రను పూర్తి చేసుకోనున్నారు.
నేటికి వెయ్యి కిలోమీటర్లు...
పాదయాత్ర జరిగే ప్రాంతం అంతటా పోలీసులు భారీగా మొహరించారు. కడవెండి వరకూ ఈరోజు పాదయాత్ర సాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ కూడా పాల్గొన్నారు. పాదయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story

