Mon Feb 17 2025 12:00:47 GMT+0000 (Coordinated Universal Time)
బీజేపీ ప్రజా బ్యాలెట్ .. ఉద్యమ కార్యాచరణ
పెరగనున్న విద్యుత్తు ఛార్జీలపై తమ ఉద్యమం ఆగదని తెలంగాణ బీజేపీ నేతలు స్పష్టం చేశారు

పెరగనున్న విద్యుత్తు ఛార్జీలపై తమ ఉద్యమం ఆగదని తెలంగాణ బీజేపీ నేతలు స్పష్టం చేశారు. ప్రజాబ్యాలెట్ ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తామని చెప్పారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి తెలంగాణలో విద్యుత్తు ఛార్జీలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ నేతలు కార్యాచరణను సిద్ధం చేశారు. ప్రజా బ్యాలెట్ ద్వారా అభిప్రాయాలను సేకరించే పనిని చేపట్టారు. తొలుత బషీరాబాగ్ లో ప్రజా బ్యాలెట్ ను ఏర్పాటు చేశారు.
ఛార్జీల పెంపుదలపై....
ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ విద్యుత్తు ఛార్జీల పెంపు పై దశల వారీగా ఉద్యమాన్ని చేస్తామని చెప్పారు. ఛార్జీలు ఉపసంహరించుకునేంత వరకూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై తమ పోరాటం ఆగదన్నారు. ప్రభుత్వం మెడలు వంచైనా విద్యుత్తు ఛార్జీలు తగ్గించి ప్రజలకు అండగా నిలుస్తామని చెప్పారు.
Next Story