Wed Mar 18 2026 19:57:26 GMT+0530 (India Standard Time)
BJP : కేంద్ర నాయకత్వం క్లాస్ బీజేపీలో పనిచేస్తున్నట్లుందిగా
తెలంగాణ బీజేపీకి మంచి రోజులు వచ్చినట్లున్నాయి.

తెలంగాణ బీజేపీకి మంచి రోజులు వచ్చినట్లున్నాయి. ఒకరకంగా అధికార, విపక్ష పార్టీలు తీసుకుంటున్న అనేక నిర్ణయాలు బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2029 లో జరుగుతాయని భావిస్తున్నారు. అంటే ఇంకా మూడేళ్ల సమయం ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనను, కాంగ్రెస్ పాలనను తెలంగాణ ప్రజలు చూశారు. బీజేపీకి ఒక్క అవకాశం ఇస్తే తప్పేంటన్న ఆలోచన చాలా మందిలో బయలుదేరింది. క్షేత్ర స్థాయిలో ఈ మూడేళ్లలో మరింత బలోపేతం అయితే బీజేపీ అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యం లేదంటున్నారు.
ఇప్పటికే బలంగా...
తెలంగాణలో ఇప్పటికే బీజేపీ బలంగా ఉంది. క్రమంగా తన బలాన్ని పెంచుకుంటూ వస్తుంది. అందుకే దక్షిణ భారతంలో బీజేపీకి కర్ణాటక తర్వాత తమిళనాడు అధికారంలోకి వచ్చే అవకాశముందన్నది పార్టీ కేంద్ర నాయకత్వం కూడా అంచనా వేస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది నియోజకవర్గాల్లో విజయం సాధించిన బీజేపీ పార్లమెంటు ఎన్నికల్లో ఎనిమిది పార్లమెంటు స్థానాల్లో గెలిచింది. అంటే దాదాపు యాభై నాలుగు నియోజకవర్గాల్లో బీజేపీ బలంగా ఉందని అనుకోవాలి. అయితే శాసనసభ, పార్లమెంటు ఎన్నికలకు తేడా ఉంటుంది.
కేంద్ర నాయకత్వ సూచనలతో...
శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలయిన వారు పార్లమెంటు ఎన్నికల్లో గెలిచారు. అంటే బీజేపీని పార్లమెంటు ఎన్నికల్లోనే ఆదరిస్తున్నారన్న వాదన కూడా ఇన్నాళ్లు ఉంది. శాసనసభలో ఓటమి పాలయిన కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, రఘునందన్ లు పార్లమెంటు ఎన్నికల్లో గెలిచారు. అయితే పార్టీ రాష్ట్ర నాయకత్వం సమైక్యంగా కలసి పనిచేస్తే అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమీ కాదని బీజేపీ కేంద్ర నాయకత్వం ఇప్పటికే తెలిపింది. ప్రధాని మోదీ సయితం కొంతకాలం క్రితం పార్టీ నేతలకు క్లాస్ పీకిన నేపథ్యంలో మరి పార్టీని విజయం వైపునకు తీసుకుని వెళ్లే దిశగా కమలం పార్టీ నేతలు ప్రయత్నిస్తారో? లేదో? చూడాలి.
Next Story

