Wed Dec 17 2025 14:14:21 GMT+0000 (Coordinated Universal Time)
BJP : నేడు హైదరాబాద్కు సునీల్బన్సాల్
నేడు హైదరాబాద్కు తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ సునీల్బన్సాల్ రానున్నారు

నేడు హైదరాబాద్కు తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ సునీల్బన్సాల్ రానున్నారు. ఆయన బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు. సునీల్ బన్సాల్ వస్తుండటంతో నేతలంతా విధిగా సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఇప్పటికే బీజేపీ నేతలకు సమాచారాన్ని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సమాచారం అందింది.
పార్టీ నేతలతో...
ఈరోజు సాయంత్రం 4 గంటలకు సునీల్ బన్సాల్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం కానున్నారు. తాజా రాజకీయ పరిస్థితులు, సభ్యత్వ నమోదు, ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించనున్నారు. వారికి దిశా నిర్దేశం చేయనున్నారు. అందరూ సమన్వయంతో పనిచేసి రానున్న ఎన్నికల్లో విజయం సాధించడం, అభ్యర్థుల ఎంపిక వంటి వాటిపై చర్చించనున్నారు.
Next Story

