Wed Sep 27 2023 15:15:07 GMT+0000 (Coordinated Universal Time)
నేటితో ముగియనున్న బండి సంజయ్ యాత్ర
తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజాసంగ్రామ పాదయాత్ర నేటితో ముగియనుంది

తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్ర నేటితో ముగియనుంది. ఈ సందర్భంగా సాయంత్రం పెద్ద అంబర్పేటలో బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ ముగింపు సభకు కేంద్ర సహాయం మంత్రి నిరంజన్ జ్యోతి ముఖ్యఅతిధిగా వస్తున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో పది రోజుల పాటు ఈ యాత్ర కొనసాగింది.
నగరంలోనే...
నాలుగో విడత పాదయాత్రలో మొత్తం 115.3 కిలోమీటర్ల మేర నడిచారు. ప్రధానంగా హైదరాబాద్ నగరంలోనే నాలుగో విడత పాదయాత్ర సాగింది. సికింద్రాబాద్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, కంటోన్మెంట్, మల్కాజ్గిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్పీ నగర్ నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగింది. నగరంలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఆయన పాదయాత్రలో ముందుకు సాగారు. ఈ యాత్ర ముగింపు సభను భారీ ఎత్తున జరపాలని నిర్ణయించారు.
Next Story