Sun Mar 15 2026 20:37:26 GMT+0530 (India Standard Time)
నేడు అమిత్ షా తో తెలంగాణ నేతలు
తెలంగాణ భారతీయ జనతా పార్టీ నేతలు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు.

తెలంగాణ భారతీయ జనతా పార్టీ నేతలు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. ఆయన ఈరోజు సమయం ఇచ్చారు. నిన్ననే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు హోంమంత్రి కార్యాలయం నుంచి సమాచారం అందింది. రాష్ట్ర రాజకీయాలపై చర్చించే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడంపై వీరు షాతో చర్చించనున్నారు.
రాష్ట్ర రాజకీయ పరిస్థితులు....
టీఆర్ఎస్ సభ్యుటు ఉభయ సభల్లో చేసిన ఆందోళన, తెలంగాణలో వరిధాన్యం కొనుగోలుతో పాటు టీఆర్ఎస్ ఎంపీల రాజీనామా వ్యవహారం కూడా వీరి మధ్య చర్చకు వచ్చే అవకాశముంది. అమిత్ షా తో సమావేశానికి నలుగురు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలు హాజరవుతారని తెలిసింది.
Next Story

