Wed Mar 18 2026 06:11:26 GMT+0530 (India Standard Time)
నేడు బీజేపీ పదాధికారుల సమావేశం
తెలంగాణ భారతీయ జనతా పార్టీ నేతలు నేడు సమావేశం కానున్నారు

తెలంగాణ భారతీయ జనతా పార్టీ నేతలు నేడు సమావేశం కానున్నారు. పదాధికారులతో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి భేటీ కానున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మధ్యాహ్నం ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ నేతలతో పాటు పదాధికారులు కూడా హాజరు కానున్నారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల పై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో...
త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ అత్యధిక స్థానాలను గెలుచుకునేందుకు అవసరమైన వ్యూహాలను రచించేందుకు ఈ సమావేశం జరగనుంది. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచారం వరకూ అన్ని విషయాలను ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై కూడా చర్చ జరగనుంది.
Next Story

