Fri Dec 05 2025 14:55:23 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : ఈ నెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ఈ నెల 30వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.

ఈ నెల 30వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ఇచ్చిన నివేదికపై చర్చించాల్సి ఉన్నందున ఈ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించిన అనంతరం దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.
కాళేశ్వరం కమిషన్ నివేదికపై...
ఈ నెల 30వ తేదీన జరిగే అసెంబ్లీ సమావేశాలు రెండు నుంచి మూడు రోజుల పాటు జరపాలని ప్రభుత్వం నిర్ణయించనుంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ఇచ్చిన నివేదికపై పూర్తి స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇందుకోసం ఉన్నతాధికారుల అసెంబ్లీ సమావేశాల కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.
Next Story

