Tue Jan 20 2026 21:08:57 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అనేక కీలక బిల్లులను ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది

నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. అనేక కీలక బిల్లులను ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. మొత్తం ఏడు బిల్లులను శాసనసభ ఆమోదించనుంది. ఈరోజు ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. స్వల్ప కాలిక చర్చ మాత్రమే చేపడతారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్తు బిల్లు, దాని ప్రభావంపై ఉభయ సభల్లోనూ నేడు స్వల్పకాలిక చర్చ జరగనుంది.
అనేక బిల్లులు....
అలాగే జీఎస్టీ చట్ట సవరణ, నిజామాబాద్ పారిశ్రామిక ప్రాంత చట్ట సవరణ, పురపాలక నిబంధనల చట్ట సవరణ, వైద్య శాఖలో డీఎంఈ, అసిస్టెంట్ డీఎంఈల పదవీ విరమరణ వయసును 65 ఏళ్లకు పెంచుతూ రూపొందించిన చట్ట సవరణ, సిద్దిపేట జిల్లా ములుగు అటవీ కళాశాలను విశ్వవిద్యాలయంగా మార్చే బిల్లు, విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు, మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లులు కూడా ప్రభుత్వం ఆమోదించనుంది.
Next Story

