Thu Sep 21 2023 16:36:25 GMT+0000 (Coordinated Universal Time)
వచ్చే నెలలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
డిసెంబరు నెలలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయించింది

డిసెంబరు నెలలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయించింది. వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశముంది. ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలతో చర్చించడంతో పాటు కీలక బిల్లులను ప్రభుత్వం ఆమోదించుకునే అవకాశాలున్నాయి.
కేంద్ర ప్రభుత్వంపై...
అయితే ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం ప్రధానంగ ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతున్న తీరును కూడా ఎండగట్టేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ ఉపయోగించుకునే అవకాశాలున్నాయి. తెలంగాణకు రావాల్సిన నలభై వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిందని, కేంద్ర ప్రభుత్వం ఆంక్షల వల్లనే ఈ ఆదాయం తగ్గిందని సమావేశాల్లో ప్రస్తావించనున్నారు.
Next Story