Sat Mar 07 2026 19:49:53 GMT+0530 (India Standard Time)
23 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ఈ నెల 23 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.

ఈ నెల 23 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఈ నెల 23వ తేదీన మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది.
కీలక బిల్లులు...
ఈ సమావేశాల్లోనూ పలు కీలక బిల్లులు ఆమోదం పొందే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ అమలు చేసిన ఎన్నికల హామీలతో పాటు అమలు చేయాల్సిన హామీలకు సంబంధించి బడ్జెట్ లో కేటాయింపులు జరిగే అవకాశముంది. ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలపనుంది.
Next Story

