Thu Dec 18 2025 17:58:50 GMT+0000 (Coordinated Universal Time)
కాషాయ కండువా కప్పుకున్న తీన్మార్ మల్లన్న
ఈరోజు తీన్మార్ మల్లన్న కూడా బీజేపీ లో చేరారు. ఢిల్లీలో తెలంగాణ ఇన్ ఛార్జి తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీలో చేరారు.

తెలంగాణ బీజేపీలో రోజూ చేరికలు కనపడుతున్నాయి. ఎవరో ఒకరు పార్టీలో వచ్చి చేరడంతో పార్టీ కళకళ లాడుతుంది. నిన్న మాజీ ఉద్యోగ సంఘాల మాజీ నేత విఠల్ బీజేపీలో చేరగా ఈరోజు తీన్మార్ మల్లన్న కూడా బీజేపీ కండువా కప్పుకున్నారు. ఢిల్లీలో తెలంగాణ ఇన్ ఛార్జి తరుణ్ చుగ్ సమక్షంలో తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరారు.
మరింత బలం....
తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ అనే వెబ్ ఛానెల్ ను నడుపుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తీన్మార్ మల్లన్న చేరిక పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. టీఆర్ఎస్ ను అధికారం నుంచి దించడానికే తాను బీజేపీలో చేరారని, పదవుల కోసం కాదని తీన్మార్ మల్లన్న చెప్పారు.
Next Story

