Sat Dec 13 2025 22:31:01 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : సీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో సాంకేతిక లోపం.. అర్జంట్ గా దించేసిన పైలట్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తున్న హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తున్న హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది. అయితే వెంటనే పైలట్ లోపాన్ని గుర్తించి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో సేఫ్ గా ల్యాండ్ చేశారు. కేసీఆర్ ప్రజాఆశీర్వద సభలో పాల్గొనేందుకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. మొత్తం నాలుగు సభల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది. నాలుగు సభల్లో ఆయన పాల్గొనాల్సి ఉండగా హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తిన కారణంగా ఆయన పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
నాలుగు సభల్లో...
కేసీఆర్ ఈరోజు దేవరకద్ర, మక్తల్, నారాయణపేట్, గద్వాల్ నియోజకవర్గాల్లో పర్యటించాల్సి ఉంది. దేవరకద్రకు పన్నెండున్నరకు చేరుకోవాల్సి ఉండగా కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆయన ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉండిపోయారు. మరో హెలికాప్టర్ కోసం ఏవియేషన్ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
Next Story

