Thu Mar 19 2026 04:28:56 GMT+0530 (India Standard Time)
యశోద ఆసుపత్రికి కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి పర్యటన వాయిదా పడింది. ఆయన యశోద ఆసుపత్రికి వెళ్లారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి పర్యటన వాయిదా పడింది. ఆయన యశోద ఆసుపత్రికి వెళ్లారు. వైద్య పరీక్షలు చేయించుకునేందుకు కేసీఆర్ యశోద ఆసుపత్రికి వచ్చారు. సీటీస్కాన్, యాంజియో గ్రామ్ పరీక్షలు చేయించుకోనున్నారు. నిజానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు యాదాద్రి లో పర్యటించాల్సి ఉంది.
ఆరోగ్య పరీక్షల కోసం....
యాదాద్రిలో జరగాల్సిన పనుల పురోగతిపై ఆయన సమీక్షించాల్సి ఉంది. అయితే ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆయన యాదాద్రి పర్యటనను వాయిదా వేసుకున్నారు. యశోద ఆసుపత్రికి చేరుకుని పరీక్షలు చేయించుకుంటున్నారు.
Next Story

