Sun Mar 15 2026 12:11:54 GMT+0530 (India Standard Time)
నేడు సంగారెడ్డి జైలుకు బీజేపీ ఎంపీలు
నేడు సంగారెడ్డి జైలుకు బీజేపీ ఎంపీ ల బృందం బయలుదేరి వెళ్లనుంది.

నేడు సంగారెడ్డి జైలుకు బీజేపీ ఎంపీ ల బృందం బయలుదేరి వెళ్లనుంది. పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ ఆధ్వర్యంలో సంగారెడ్డి జైలుకు బీజేపీలు ఎంపీలు వెళ్లనున్నారు. ఎంపీ లు ఈటెల రాజేందర్, కొండ విశ్వేశ్వర రెడ్డి డీకే అరుణ వెంట బయలుదేరి సంగారెడ్డి జైలుకు వెళతారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. లగచర్ల ఘటనలో అరెస్టయిన వారితో బీజేపీ ఎంపీలు ములాఖాత్ కానున్నారు.
లగచర్ల గ్రామంలో...
అనంతరం సాయంత్రం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల గ్రామం లో పార్లమెంటు సభ్యులు పర్యటించనున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శిస్తూ....వారి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించేందుకు వెళ్తున్నట్లు బీజేపీ ఎంపీ లు తెలిపారు. అయితే పోలీసులు వీరి పర్యటనకు అనుమతిస్తారా? లేదా? అన్నది చూడాలి.
Next Story

