Thu Mar 19 2026 15:05:34 GMT+0530 (India Standard Time)
రేపు ఖమ్మంలో బాబు బహిరంగ సభ
తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. రేపు తెలంగాణలో ఆయన పర్యటించనున్నారు

తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. రేపు తెలంగాణలో ఆయన పర్యటించనున్నారు. ప్రధానంగా హైదరాబాద్, ఖ్మమ్మం జిల్లాల్లో రేపు పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రేపు ఉదయం 9.30 గంటలకు రసూల్పుర లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులర్పించనున్న చంద్రబాబు అక్కడి నుంచి హబ్సిగూడ, ఉప్పల్, ఎల్బినగర్, హయత్ నగర్ ల మీదరుగా టేకుమెట్ల బ్రిడ్జి వద్దకు చేరకుకుటారు.
బహిరంగ సభలో...
మధ్యాహ్నం 2.30 గంటలకు కేశవాపురం వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఖమ్మం చేరుకుని మయూరి జంక్షన్ నుంచి ర్యాలీగా పటేల్ స్టేడియానికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. బహిరంగ సభ అనంతరం అక్కడ నుంచి నేరుగా బయలుదేరి రోడ్డుమార్గాన విజయవాడ ఉండవల్లి తన నివాసానికి చేరుకుంటారు.
Next Story

