Fri Dec 05 2025 10:52:21 GMT+0000 (Coordinated Universal Time)
తాతను గుర్తు చేసుకున్న తారక్, కల్యాణ్‌రామ్
స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ నివాళి అర్పించారు.

స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ నివాళి అర్పించారు. తెల్లవారుజామునే ఎన్టీఆర్ ఘాట్ ని సందర్శించి ఘూట్పై పూలు చల్లి నివాళులర్పించారు. అనంతరం అక్కడే కూర్చోని తాత ఎన్టీఆర్‌ని గుర్తు చేసుకున్నారు.
ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ముందుగా ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించి నివాళులర్పిస్తారు. ప్రముఖుల రాకను పురస్కరించుకుని ఎన్టీఆర్ ఘాట్ వద్ద పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
Next Story

