Fri Jan 30 2026 01:07:44 GMT+0000 (Coordinated Universal Time)
టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రయత్నం.. ప్రజలకు చేరువలో?
తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు.

తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందుకోసం ప్రత్యేక యాప్ ను రూపొందించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా ఈ యాప్ లో చెప్పుకోవచ్చని రోహిత్ రెడ్డి సూచించారు. ప్రజా బంధు పేరుతో ఈ యాప్ ను రూపొందించారు. తమ ప్రాంతంలో ఉన్న సమస్యలను నేరుగా తనకు చెప్పుకోవాలన్నా, సమస్యల పై ఫిర్యాదు చేయాలన్నా ఈ యాప్ లో తెలపవచ్చని రోహిత్ రెడ్డి తెలిపారు.
ఈ యాప్ ద్వారా....
త్వరలోనే ఈ యాప్ ను అందుబాటులోకి వస్తుందన్నారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరగకుండా నేరుగా చెప్పుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ సమస్యల పరిష్కారం ఎంతవరకూ వచ్చిందో తెలుసుకోవచ్చని, ట్రాక్ చేయవచ్చని కూడా రోహిత్ రెడ్డి తెలిపారు.
- Tags
- rohith reddy
- mla
Next Story

