Thu Mar 12 2026 10:45:02 GMT+0530 (India Standard Time)
Telangana : సుప్రీంకోర్టులో నేడు అనర్హత పిటీషన్లపై విచారణ
సుప్రీంకోర్టులో నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్లపై విచారణ జరగనుంది

సుప్రీంకోర్టులో నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్లపై విచారణ జరగనుంది. ఇప్పటికే స్పీకర్ పార్టీ మారినట్లు ఆరోపణలున్న పది మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. దీంతో నేడు సుప్రీంకోర్టులో అనర్హత పిటీషన్లపై విచారణ జరగనుంది. ప్రధానంగా దానం నాగేందర్, కడియం శ్రీహరి పిటీషన్లను కొట్టివేయడంపై బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం చెబుతున్నారు.
ఇరువర్గాల వాదనలు...
ఈ నేపథ్యంలో నేడు సుప్రీంకోర్టు లో జరుగుతున్న విచారణలో బీఆర్ఎస్ నేతలు తమ వాదనలను వినిపించే అవకాశముందని తెలిసింది. దానం నాగేందర్ 2024లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారని బీఆర్ఎస్ తరుపున న్యాయవాదులు వాదించనున్నారు. మరొకవైపు ఎమ్మెల్యేల తరుపున న్యాయవాదులు కూడా తమ వాదనలను వినిపించనున్నారు.
Next Story

