Thu Mar 12 2026 15:20:22 GMT+0530 (India Standard Time)
Breaking : అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. అయితే బీఆర్ఎస్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్లపై కేసును సుప్రీంకోర్టును డిస్పోజ్ చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ధర్మాసనం కోర్టు ఆదేశాల మేరకు విచారణ పూర్తి చేశామని స్పీకర్ తరుపున న్యాయవాదులు చెప్పడంతో ఈ కేసును డిస్పోజ్ చేసినట్లు ధర్మాసనం పేర్కొంది.
పిటీషన్ డిస్పోజ్ చేసి....
బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ కు నేడు వచ్చింది. సుప్రీంలో కౌశిక్, కేటీఆర్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ వేశారు. తమ ఆధారాలను పరిగణనలోకి తీసుకోలేని స్పీకర్ తీర్పుపై పేర్కొన్నారు. అయితే సుప్రీంకోర్టుకు పూర్తి సమాచారం స్పీకర్ తరుపున న్యాయవాదులు సమాచారం అందించి, పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్ పై విచారణ పూర్తయిందని చెప్పడంతో ఈ కేసును డిస్పోజ్ చేసింది.
Next Story

