Fri Dec 05 2025 12:47:26 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్ కు చుక్కెదురు
సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. స్పెషల్ లీవ్ పిటిషన్ ను కొట్టివేసింది

సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. స్పెషల్ లీవ్ పిటిషన్ ను కొట్టివేసింది. యాభై శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని సూచించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా తీసుకువచ్చిన జీవో నెంబర్ 9 అమలుపై తెలంగాణ హైకోర్టు స్టేని ఎత్తివేయాలని తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు కోరారు.
పిటీషన్ కొట్టివేస్తూ...
అయితే సుప్రీంకోర్టు మాత్రం గవర్నర్ వద్ద బిల్లులు పెండింగ్ లో ఉండగా, జీవోను ఎలా జారీ చేస్తారని ప్రశ్నించింది. 50 శాతం రిజర్వేషన్లకు మించకుండా ఎన్నికలు నిర్వహించాలని గతంలో ఉన్న తీర్పులను ఉదహరించింది. ఈ స్పెషల్ లీవ్ పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాలి.
Next Story

