Thu Feb 05 2026 09:05:31 GMT+0000 (Coordinated Universal Time)
డీజీపీ నియామకంపై సుప్రీంకోర్టు తీర్పు
తెలంగాణలో రెగ్యులర్ డీజీపీ నియామకంపై సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది

తెలంగాణలో రెగ్యులర్ డీజీపీ నియామకంపై సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సవరించింది. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి నియామకంపై విచారించిన సుప్రీంకోర్టు ఈ తీర్పు చెప్పింది. గత ఏప్రిల్ నెలలో తెలంగాణ ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలు పరిగణనలోకి తీసుకోవాలన్న సుప్రీంకోర్టు యూపీఎస్సీకి సూచించింది.
నాలుగు వారాల్లోగా...
తెలంగాణ డీజీపీగా శివధర్ రెడ్డి నియామకాన్ని తప్పు పడుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే దీనికి సంబంధించిన విచారణ పూర్తి చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం నాలుగు వారాల్లోగా పూర్తిస్థాయి డీజీపీ నియామక ప్రక్రియను పూర్తిచేయాలని యూపీఎస్సీని ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Next Story
