Mon Mar 16 2026 07:34:05 GMT+0530 (India Standard Time)
రేవంత్‌తో మహేశ్ బాబు భేటీ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలసి యాభై లక్షల రూపాయల చెక్కును సూపర్ స్టార్ మహేశ్ బాబు అందించారు

ముఖ్యమంత్రి సహాయ నిధికి సినీ నటుడు మహేశ్ బాబు భారీ విరాళాన్ని ప్రకటించారు. ఆ విరాళాన్ని చెక్కు రూపంలో నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు తెలంగాణకు యాభై లక్షలు, ఆంధ్రప్రదేశ్ కు యాభై లక్షల రూపాయలు విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
భారీ విరాళం...
ఇటీవల వరదలతో నష్టపోయిన ప్రాంతాల వారికి న్యాయం చేయడానికి తాను ఈ సాయం చేస్తున్నట్లు మహేశ్ బాబు ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలసి యాభై లక్షల రూపాయల చెక్కును అందించారు. మహేశ్ బాబు వెంట ఆయన సతీమణి నమ్రత కూడా ఉన్నారు.
Next Story

