Fri Dec 05 2025 22:47:39 GMT+0000 (Coordinated Universal Time)
ఆందోళనలో సన్నీ యాదవ్ తల్లిదండ్రులు
యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ ను ఎన్ఐఏ అధికారులు చెన్నై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు.

యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ ను ఎన్ఐఏ అధికారులు చెన్నై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే సన్నీ యాదవ్ బైక్పై పాకిస్థాన్ వెళ్లి వచ్చాడు. దీంతో పాకిస్థాన్ పర్యటనకు సంబంధించిన వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. తమ కుమారుడు ఎక్కడ ఉన్నాడో చెప్పాలని సన్నీ యాదవ్ తండ్రి రవీందర్ కోరారు.
సన్నీ యాదవ్ స్నేహితుడు చెర్రీని కూడా మే 29న గుర్తుతెలియని వ్యక్తులు అదుపులోకి తీసుకున్నారని, కొద్దిరోజుల క్రితం సెంట్రల్ స్పెషల్ బ్రాంచ్ అధికారులు తమ ఇంటికి కూడా వచ్చారన్నారు. తమ కుమారుడు ఏ తప్పు చేయలేదని, వివిధ దేశాల్లో బైక్ రైడ్ చేస్తూ అక్కడి సంస్కృతి, జీవనశైలిపై వీడియోలు చేస్తూ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాడన్నారు. పాకిస్తాన్ కు ఫిబ్రవరి 6న వెళ్లి ఏప్రిల్ 10న ఇంటికి వచ్చాడని, అక్కడ బైక్ రైడ్ చేసిన వీడియోలను ఈ మధ్యనే అప్లోడ్ చేశాడన్నారు.
Next Story

