Thu Jan 29 2026 20:16:57 GMT+0000 (Coordinated Universal Time)
అంశాల స్వామి మృతి
ఫ్లోరోసిస్ బాధితుడు, నల్లగొండ జిల్లా ఫ్లోరోసిస్ లిబరేషన్ కమిటీ నేత అంశాల స్వామి మరణించారు.

ఫ్లోరోసిస్ బాధితుడు, నల్లగొండ జిల్లా ఫ్లోరోసిస్ లిబరేషన్ కమిటీ నేత అంశాల స్వామి మరణించారు. బైక్ పై నుంచి కింద పడిపోవడంతో ఆయన మరణించారు. శనివారం అంశాల స్వామి మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్యపై అంశాల స్వామి గత కొన్ని దశాబ్దాలుగా పోరాడుతున్నారు.
ఫ్లోరోసిస్ సమస్యపై...
వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు కూడా అంశాలస్వామి ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లగలిగారు. ఇటీవల మంత్రి కేటీఆర్ అంశాల స్వామి ఇంటికి వెళ్లి ఆయనతో కలసి భోజనం చేశారు. అంశాల స్వామి మృతిపట్ల మంత్రి కేటీఆర్ సంతాపాన్ని తెలిపారు. ఫ్లోరోసిస్ బాధితుల కోసం అంశాల స్వామి నిరంతరం పోరాడారని కేటీఆర్ పేర్కొన్నారు. ఆయన ఎప్పటికీ తన మనసులో గుర్తుండి పోతారని కేటీఆర్ చెప్పారు.
Next Story

