Sun Mar 08 2026 03:10:31 GMT+0530 (India Standard Time)
Telangana : నేడు కూడా దక్షిణ కొరియాలో మంత్రుల పర్యటన
దక్షిణ కొరియాలో తెలంగాణ మంత్రుల పర్యటన కొనసాగుతుంది.

దక్షిణ కొరియాలో తెలంగాణ మంత్రుల పర్యటన కొనసాగుతుంది. అక్కడ రాజధాని సియోల్ లో నది పునరుజ్జీవానికి సంబంధించి అథ్యయనానికి తెలంగాణ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు దక్షిణ కొరియా బయలుదేరి వెళ్లారు. ఈరోజు రాజధాని సియోల్ లో తెలంగాణ మంత్రులు , అధికారుల బృందం పర్యటటిస్తుంది.
సియోల్ లోని హాన్ నది...
సియోల్ లోని హాన్ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్ ను మంత్రుల బృందం సందర్శించనుంది. సియోల్ నగరంలో నీటి సరఫరాతో పాటు పర్యావరణం మరియు ఆర్థిక వ్యవస్థకు కీలకంగా ఉన్న హాన్ నదిని పరిశీలించనున్నారు. కాలుష్యానికి గురైన హాన్ నదిని శుభ్రపరచి, పునరుద్ధరించిన దక్షిణ కొరియా ప్రభుత్వం నుంచి సమాచారం తెలుసుకునేందుకు, ప్రత్యక్షంగా చూసేందుకు అక్కడకు వెళ్లారు. మూసీ నది పునరుజ్జీవం కోసం ఈ అధ్యయన యాత్రను మంత్రులు చేపట్టారు.
Next Story

