Fri Mar 13 2026 19:41:07 GMT+0530 (India Standard Time)
Breaking : తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ కార్మికుల సంఘం యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చారు. లేబర్ కమిషనర్ కార్యాలయంలో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నోటీసు ఇచ్చింది. ఆర్టీసీ ఎండీ పేషీలోనూ నోటీసులను ఇచ్చింది. నోటీసు ఇచ్చిన పథ్నాలుగు రోజుల తర్వాత సమ్మెపై నిర్ణయం తీసుకుంటామని అందులో పేర్కొంది.
తమ సమస్యలను పరిష్కరించాలని...
ఈలోపు తమ సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు కోరుతున్నాయి. తమ దీర్ఘకాలంగా అమలు చేయకుండా ఉన్న డిమాండ్లను పరిష్కరించాలని, లేకుంటే సమ్మెకు దిగుతామని హెచ్చరించాయి. ఆర్టీసీ ఎండీ అందుబాటులో లేకపోవడంతో పేషీలో ఈ నోటీసులు ఇచ్చినట్లు కార్మిక సంఘాల నేతలు పేర్కొన్నారు.
Next Story

