Mon Dec 08 2025 14:23:07 GMT+0000 (Coordinated Universal Time)
బీజేపీ ఎమ్మెల్యేలతో బండి సమావేశం
భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలతో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమావేశం కాబోతున్నారు.

భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలతో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమావేశం కాబోతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఇప్పటికే బయట టీఆర్ఎస్ పై యుద్దం చేస్తున్న బీజేపీ అసెంబ్లీ సమావేశాల్లోనూ కొనసాగించాలని నిర్ణయించింది. ప్రధానంగా శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసు పై బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయాలని భావిస్తుంది. అక్రమ కేసులను బనాయిస్తూ విపక్ష నేతలను మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ అభిప్రాయపడుతుంది.
తొలిసారి ఈటల....
కాగా ఈ అసెంబ్లీ సమావేశాలకు ఒక ప్రత్యేకత ఉంది. మొన్నటి వరకూ మంత్రిగా, టీఆర్ఎస్ సభ్యుడిగా ఉన్న ఈటల రాజేందర్ తొలిసారిగా విపక్ష స్థానంలో అడుగుపెట్టబోతున్నారు. ఏపీ అసెంబ్లీలో ముగ్గురు శాసనసభ్యులు ఉన్నారు. వీరిలో రాజాసింగ్ బీజేపీలో సీనియర్ సభ్యుడు. ఆయననే శాసనసభలో పార్టీ నేతగా ప్రకటించే అవకాశముంది. దీనిపై కూడా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది.
- Tags
- bandi sanjay
- bjp
Next Story

