Thu Dec 18 2025 17:57:12 GMT+0000 (Coordinated Universal Time)
సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ పర్యటన
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లాకు చేరుకున్నారు. ఆయన సిరిసిల్ల పట్టణంలో పర్యటిస్తున్నారు

రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లాకు చేరుకున్నారు. ఆయన సిరిసిల్ల పట్టణంలో పర్యటిస్తున్నారు. దళిత బంధు పథకంలో వచ్చిన సొమ్ములతో ఏర్పాటు చేసిన రైస్ మిల్లును ఆయన ప్రారంభించారు. దళితబంధు పథకంతో అనేక మంది వ్యాపారులుగా మారుతూ తమ జీవితాలను మార్చుకుంటున్నారని కేటీఆర్ తెలిపారు. ఈ పథకం ఎంతో మంది దళితుల కుటుంబాల్లో వెలుగునింపుతుందని తెలిపారు.
అవార్డుల ప్రదానం...
మంత్రి కేటీఆర్ అనంతరం సిరిసిల్ల పట్టణంలో చిన్నపిల్లల ఆసుపత్రిని కూడా ఈరోజు ప్రారంభించనున్నారు. అనంతరం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొననున్నారు. అక్కడ భోజనం చేసిన అనంతరం ఉత్తమ ప్రతిభ కనపర్చిన 27 గ్రామ పంచాయతీలకు మంత్రి కేటీఆర్ అవార్డులను ఇవ్వనున్నారు. కేటీఆర్ పర్యటిస్తుండటంతో పార్టీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభకు భారీగా జనసమీకరణ చేయనున్నారు.
- Tags
- ktr
- minister ktr
Next Story

