Fri Jan 09 2026 03:35:18 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : త్వరలో మున్సిపల్ ఎన్నికలు.. ఈ నెలాఖరుకు షెడ్యూల్
రాష్ట్రంలోమున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుడల చేయనుంది

రాష్ట్రంలోమున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుడల చేయనుంది. సంక్రాంతి పండుగకు మూడు రోజులు ముందుగానే ప్రకటించే అవకాశం ఉంది. నేడు రాజకీయ పార్టీలతో తెలంగాణ ఎన్నికల అధికారి భేటీ కానున్నారక. స్థానిక సంస్థల ఏర్పాట్లపై ఎస్ఈసీ చర్చించనుంది. రాష్ట్రంలో 117 మున్సిపాలిటీలకు ఈనెల 20లోగా నోటిఫికేషన్ వెలువడే అవకాశముందని తెలిసింది. తెలొంగాణలోని 117 మునిసిపాలిటీలు, 6 మునిసిపల్ కార్పొరేషన్లలో వార్డుల వారీగా ఓటర్ల జాబితా తయారీని షెడ్యూల్ ప్రకారం సిద్ధంచేస్తోంది. ఈనెల 12న రాష్ట్రవ్యాప్తంగా అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో వార్డుల వారీగా తుది ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు.
ఇప్పటికే అధికారులకు ఆదేశాలు...
మున్సిపాలిటీల్లో ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని, కార్యదర్శి మంద్ మకరంద్ అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల కమిషనర్లతో బుధవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తిచేయాలని కమిషనర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎప్పుడైనా మున్సిపాలిటీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముంది. ఇటీవల పంచాయతీ ఎన్నికలను మూడు దఫాలుగా సజావుగా నిర్వహించిన నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలను కూడా మూడు దశల్లో నిర్వహించాలని నిర్ణయించారు.
తుది ఓటర్ల జాబితాలో...
ఈనెల 12న అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఓటర్ల తుది జాబితాను ప్రచురించాలని, 13న పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా ప్రచురణ.. ఆ వెంటనే 'టీ-పోల్' సాఫ్ట్‌వేర్‌లో అప్లోడ్ చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారులు సూచించారు.. 16న ఫొటోలతో కూడిన ఓటర్ల తుది జాబితాను పోలింగ్ కేంద్రాల వారీగా ప్రచురించాలని మున్సిపల్ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు అందాయి. సంక్రాంతి పండగ ముగిసిన తర్వాత నోటిఫికేషన్ విడుదల చేసి ఫిబ్రవరి నెలాఖరుకు ఎన్నికలను పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తుంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నేడు జరిగే ప్రజాప్రతినిధుల సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశముంది.
Next Story

