Sat Jan 31 2026 07:02:18 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : తెలంగాణలో మరో ఎన్నికలకు అంతా సిద్ధం.. రెడీ అవుతున్న అధికారులు
తెలంగాణలో మరో ఎన్నికలకు రంగం సిద్ధమయింది. దీనిపై అధికారులు కసరత్తులు చేస్తున్నారు.

తెలంగాణలో మరో ఎన్నికలకు రంగం సిద్ధమయింది. దీనిపై అధికారులు కసరత్తులు చేస్తున్నారు. త్వరలోనే తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమచారం. జూన్ మొదటి వారంలో వార్డుల విభజన చేయడానికి సిద్దమవుతున్నారు. రెండవ వారంలో రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మూడవ వారంలో సర్పంచ్ లకు రిజర్వేషన్ ప్రక్రియ ఉంటుందని తెలిసింది.
పంచాయతీ ఎన్నికలను...
జులై మొదటి వారంలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముందని చెబుతున్నారు. చివరి వారంలో నోటిఫికేషన్ విడుల చేస్తారని అధికారిక వర్గాలు తెలిపాయి. షెడ్యూల్ ప్రకారం ఆగష్టు 2వ తేదీ లోపు ఎన్నికలు నిర్వహణ పూర్తి చేయాలని నిర్ణయించారు. ఆగస్టు 10వ తేదీ లోపు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 12,814 గ్రామపంచాయతీలు, 88,682 వార్డులకు ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు రెడీ అవుతున్నారు.
Next Story

