Fri Mar 27 2026 19:24:30 GMT+0530 (India Standard Time)
Telangana : రేపటి నుంచి ఎమ్మెల్యేలకు ఆటల పోటీలు
ఈ నెల 28, 29 తేదీల్లో తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల స్పోర్ట్స్, నాటక ప్రదర్శనలు జరగనున్నాయి

ఈ నెల 28, 29 తేదీల్లో తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల స్పోర్ట్స్, నాటక ప్రదర్శనలు జరగనున్నాయి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఈ పోటీలను నిర్వహించనున్నారు. ఈ నెల 28వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. స్పోర్ట్స్ ఎల్బీ స్టేడియంలో, నాటక ప్రదర్శనలు రవీంద్ర భారతిలో నిర్వహించనున్నారు.
నాటక పోటీలు కూడా...
ఎల్బీ స్టేడియంలో ప్రారంభం కాబోతున్న శాసనసభ్యుల క్రీడోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి అన్నారు. ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో టగ్ ఆఫ్ వార్, ఫుట్బాల్ క్రికెట్ అథ్లెటిక్స్, కబడ్డీ,వాలీబాల్ బాడ్మింటన్,టేబుల్ టెన్నిస్, తోపాటు కొన్ని రిక్రియేషనల్ క్రీడా పోటీలు నిర్వహించనున్నారు.
Next Story

