Sat Mar 07 2026 21:54:17 GMT+0530 (India Standard Time)
రేవంత్ ఇంటికి సిట్ పోలీసులు
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి స్పెషల్ ఇన్విస్టేగషన్ టీం పోలీసులు నోటీసులు ఇచ్చారు

టీపీసీసీ చీఫ్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి స్పెషల్ ఇన్విస్టేగషన్ టీం పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల ఇరవై మూడో తేదీన విచారణకు హాజరు కావాలని కోరారు. రేవంత్ ఇంటికి నోటీసులు అంటించి వెళ్లిపోయారు. అయితే తాను సిట్ విచారణకు సహకరిస్తానని రేవంత్ తెలిపారు. సిట్ విచారణకు తాను భయపడేది లేదన్నారు. తనను వేధించాలనే సిట్ అధికారులు తనకు నోటీసులు జారీ చేశారని రేవంత్ రెడ్డి అన్నారు.
కేటీఆర్ కు కూడా ఇవ్వండి....
కానీ మంత్రి కేటీఆర్ కు కూడా సిట్ అధికారులు నోటీసులు ఇవ్వాలని ఆయన కోరారు. కేటీఆర్ కు నోటీసులు ఇవ్వకపోతే తాను కోర్టును ఆశ్రయిస్తానని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష పత్రాల లీకేజీ విషయంలో కేవలం ఇద్దరికి మాత్రమే సంబంధం ఉందని కేటీఆర్ అనడాన్ని ఆయన గుర్తు చేశారు.
Next Story

