Sat Mar 07 2026 23:41:26 GMT+0530 (India Standard Time)
నెల రోజుల పాటు కాచిగూడ-నిజామాబాద్ డెమూ రైళ్లు రద్దు
కాచిగూడ-నిజామాబాద్ డెమూ రైళ్లను నేటి నుంచి మార్చి నెలాఖరు దాకా రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది

కాచిగూడ-నిజామాబాద్మధ్య నడిచే డెమూ రైళ్లను నేటి నుంచి మార్చి నెలాఖరు దాకా రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. కాచిగూడ-నిజామాబాద్ సెక్షన్లో ట్రాక్ పునరుద్ధరణ పనులు జరుగుతున్న కారణంగానే ఈ రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు ఈ అసౌకర్యాన్ని గమనించాలని కోరారు.
ఏసీ చెయిర్ కార్ ను...
లింగంపల్లి-విజయవాడ మధ్య నడిచే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కు అదనంగా మరొక ఏసీ చైర్కార్ను జత చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. శనివారం విజయవాడ నుంచి లింగంపల్లి వచ్చే ఎక్స్ప్రె్సలో, ఆదివారం లింగంపల్లి నుంచి విజయవాడ వెళ్లే ఎక్స్ప్రెస్లో ప్రయాణికులకు అదనపు ఏసీ చైర్కార్ పది హేను రోజుల పాటు అందుబాటులో ఉంటుందని చీఫ్ పీఆర్వో శ్రీధర్ తెలిపారు..
Next Story

