Tue Jan 20 2026 18:01:39 GMT+0000 (Coordinated Universal Time)
BRS : 11న బీఆర్ఎస్ కీలక సమావేశం
ఈనెల 11న తెలంగాణ భవన్లో పార్టీ శ్రేణులతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశం కానున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఈనెల 11న తెలంగాణ భవన్లో పార్టీ శ్రేణులతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశం కానున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ ముఖ్యనేతలందరూ హాజరు కావాలని ఇప్పటికే నేతలకు సందేశాలు వెళ్లాయి. చాలా రోజుల నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ఆయన తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిసింది.
ఈ సమస్యలపై...
ఈ సమావేశంలో ప్రధానంగా రైతుల సమస్యలు, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, వాటిని అమలు చేయడంలో విఫలమవ్వడం తదితర అంశాలను ప్రజల్లోకి ఏవిధంగా తీసుకువెళ్లాలన్న దానిపై కేసీఆర్ నేతలతో చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే విధంగా పార్టీ అధినేతగా జిల్లాల పర్యటనపై కూడా ఈ సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశముంది.
Next Story

