Sun Jan 19 2025 23:31:57 GMT+0000 (Coordinated Universal Time)
కన్నతల్లిని శ్మశానంలో వదిలేసిన కొడుకులు
కసాయి కొడుకులు కొందరు కన్నతల్లిని శ్మశానంలో వదిలేశారు. జగిత్యాలలో ఈ ఘటన జరిగింది
కుటుంబాలు ఛిద్రమయ్యాయి. ప్రేమలు దూరమయ్యాయి. అంతా కపట ప్రేమలు మాత్రమే మిగులున్నాయి. కన్న తల్లి దండ్రులను కూడా పట్టించుకోని అనేక మంది ప్రబుద్ధులు నేటి రోజుల్లో ఎంతో మంది ఉన్నారు. ఆస్తుల కోసం వారిని చూసే వారు తప్పించి ప్రేమగా తమను పెంచి పెద్ద చేసిన వారిని మాత్రం వృద్ధాప్యంలో వదిలేస్తున్నారు.
పింఛను డబ్బులు కోసం...
జగిత్యాలలో ఇలాంటి ఘటన జరిగింది. కసాయి కొడుకులు కొందరు కన్నతల్లిని శ్మశానంలో వదిలేశారు. ఎనిమిది రోజులుగా స్మశాన వాటికలోనే వృద్ధురాలు రాజవ్వ ఉంటుంది. పెన్షన్ డబ్బుల కోసం తల్లిని చితకబాదిన కుమారుడు ఆమెను శ్మశానంలో విడిచెప్టారు. కాలు విరగడంతో అచేతన స్థితిలో రాజవ్వ ఉంది. నలుగురు కొడుకులున్నప్పటికీ ఎవరూ ఆదుకోవడం లేదు. దీంతో ఇది చూసిన కొందరు అధికారులకు సమాచారం అందించగా వారు ఆసుపత్రికి తరలించి రాజవ్వకు చికిత్స అందిస్తున్నారు.
Next Story